కార్తికేయ 2 డిజిటల్ హక్కులను భారీ ధరలకు దక్కించుకున్న ప్రముఖ ఓటిటి సంస్థ?

హ్యాపీడేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిఖిల్ సిద్ధార్థ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత యువత సినిమా ద్వారా హీరోగా మారిన నిఖిల్ స్వామి రారా కార్తికేయ వంటి సినిమాల ద్వారా హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కార్తికేయ సినిమా సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా ఇటీవల ఆగస్టు 13వ తేదీన విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదట ఈ సినిమా విడుదల చేయడానికి థియేటర్లు మేకర్స్ దొరక్క ఎన్నో అవస్థలు పడ్డారు.

ఈ విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో నిఖిల్ వెల్లడించాడు. ఎన్నో ఆటంకాల నడుమ ఆగస్టు 12వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదట తక్కువ థియేటర్లలో విడుదలయ్యింది. సినిమా గురించి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ వల్ల ప్రస్తుతం ఈ సినిమా మూడింతలు ఎక్కువ థియేటర్లలో రన్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని లాభాల వైపు పరుగులు తీస్తోంది. తెలుగులోనే కాకుండా ఈ సినిమా విడుదలయిన అన్ని భాషలలోను ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా ఇటీవల ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ – 5 దక్కించుకుందని సమాచారం. ఆరు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి స్పందన చూసి హీరో నిఖిల్ తో పాటు సినిమా మేకర్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్తీకేయ సినిమాలో నిఖిల్ కి జోడిగా స్వాతి నటించగా ఈ కార్తీకేయ 2 సినిమాలో నిఖిల్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించించింది. ఈ సినిమా ద్వార నిఖిల్ రేంజ్ నార్త్ ఇండస్ట్రీ వరకు వెళ్ళింది.