ఓటీటీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న కార్తికేయ2?

Karthikeya 2 movie review

దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2.కార్తికేయ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ద్వారక నేపథ్యంలో కృష్ణుడి గురించి ఎంతో అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిన్న సినిమాగా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేస్తుంది.
ఇలా తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడ హిందీ భాషలలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇలా పలు భాషలలో విడుదలైన ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ సినిమాపై ఎంతోమంది సినీ ప్రముఖులు ప్రశంశల వర్షం కురిపించారు. ఇలా థియేటర్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది.ఈ క్రమంలోనే అక్టోబర్ 5వ తేదీ విజయదశమి సందర్భంగా ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

థియేటర్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో ప్రసారమవుతు అతి తక్కువ సమయంలోనే భారీ స్ట్రీమింగ్ మినిట్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన 48 గంటల్లోనే 100 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ సొంతం కావడం విశేషం. ఈ సినిమాని తిరిగి ప్రేక్షకులు ఓటీటీలో కూడా ఈ సినిమాని చూస్తూ పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ పొందారు.