గేమ్ చేంజర్ కధ నాదే గాని.. సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన కార్తీక్ సుబ్బరాజు!

కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్న డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు జిగర్తాండ సినిమాతో టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టాడు.అతను తీసిన జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీ రీసెంట్గా నవంబర్ 10న రిలీజ్ అయింది. విక్రమ్ లాంటి సూపర్ స్టార్స్ తో కూడా సినిమాలు తీసి తనదైన ముద్ర వేశాడు కార్తీక్ సుబ్బరాజు.

ఈ మధ్యనే గోవా లోని పణజీ లో జరుగుతున్న 55 ఇంటర్నేషనల్ ఫీలిమ్ ఫెస్టివల్ కి హాజరైన కార్తీక్ సుబ్బరాజు తన లేటెస్ట్ సినిమాలతో పాటు గేమ్స్ చేంజెస్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు కథ అందించిన సంగతి అందరికీ తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయింది. గేమ్ చేంజెర్ సినిమా కథ గురించి మాట్లాడుతూ ఈ కథని నేను శంకర్ సార్ ని కలవక ముందే రాశాను.

కచ్చితంగా ఒక పెద్ద హీరోతో మాత్రమే సాధ్యమవుతుందని నా టీం కి చెప్పాను. అదే కదకు బలం. అయితే రాజకీయ నేపథ్యంలో సినిమాలు నేను చేయాలని అనుకోలేదు. సినిమా కథ నాదే గాని పక్కా శంకర్ మార్కు విజన్ ఉంటుంది. ఆయన చిత్రాల ప్రభావంతోనే నేను సినిమా దర్శకుడుని అయ్యాను. అలాంటిది నా కథను ఆయన దర్శకత్వం వహించడం మర్చిపోలేని విజ్ఞాపకం అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే సూర్య 44 వర్కింగ్ టైటిల్ తో సూర్యని హీరోగా పెట్టి తను తీస్తున్న సినిమా గురించి కూడా మాట్లాడిన సుబ్బరాజు ఈ సినిమాని 2025 వేసవిలో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా సూర్యతో తాను వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందని, సూర్య ప్రతిభావంతుడైన భారతీయ నటుడని కొనియాడారు. ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజు చేసిన కామెంట్స్ అటు గేమ్ చేంజర్ సినిమాతో పాటు అటు సూర్య సినిమాపై కూడా అమాంతం అంచనాలు పెంచేసాయి.