సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు అట్లీ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా తీసి 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అక్కడ కూడా విజయకేతనం ఎగరవేసిన వ్యక్తి. సౌత్ దర్శకుల స్థాయిని బాలీవుడ్ ఫిలిం స్టార్స్ కి హిందీ మీడియా కి రుచి చూపించిన అట్లీ తాజాగా హిందీలో బేబీ జాన్ సినిమాని నిర్మించారు.ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
కీర్తి సురేష్ కి బాలీవుడ్ లో ఇది మొట్టమొదటి సినిమా. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో అనే కామెడీ షో లో చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు అట్లీ. అయితే కపిల్ షో సంగతి అందరికీ తెలిసిందే కదా కామెడీ పేరుతో ప్రముఖులని అవమానించడం, వారిని కామెంట్స్ చేయటం, తరచూ విమర్శల పాలు అవ్వటం అందరికీ తెలిసిందే.
అయితే బేబీ జాన్ యూనిట్ ఈ షో కి వెళ్ళినప్పుడు కపిల్ శర్మ అట్లే కలర్ ని ప్రస్తావిస్తూ కథ చెప్పటానికి మీరు ఎవరైనా స్టార్ హీరో దగ్గరికి వెళ్ళిన సమయంలో వాళ్లు అట్లీ ఎక్కడా.. కనిపించడం లేదు అని అడిగారా అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్న వెనుక ఉన్న వెటకారాన్ని అర్థం చేసుకున్న అట్లీ మీ ప్రశ్న అడగడం వెనుక ఉన్న ఉద్దేశం నాకు అర్థమైంది, టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది పెద్ద విషయం కాదు నిజం చెప్పాలంటే దర్శకుడు మురుగదాస్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పాలి.
తొలిసారి నేను కథ ఆయన వద్ద చెప్పాను, ఆ సమయంలో నా కథ విని ఆయన నా యొక్క రూపం గురించి ఆలోచించలేదు కేవలం నా స్క్రిప్ట్ గురించి మాత్రమే ఆలోచించి అవకాశం ఇచ్చారు. అయినా షో కి ఆహ్వానించి ఈ విధంగా అవమానించడం బాగోలేదు, ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నాను అని కపిల్ కి గట్టిగానే సమాధానం చెప్పాడు అట్లీ. నెటిజన్స్ కూడా కపిల్ వక్రబుద్ధిని తప్పుపడుతున్నారు.