చంద్రముఖి 2 లో సందడి చేయనున్న కంగనా రనౌత్.. త్వరలోనే ప్రకటన?

పి వాసు దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార, జ్యోతిక ప్రభు వంటి పలువురు సెలబ్రిటీలు నటించిన చిత్రం చంద్రముఖి. హర్రర్ త్రిల్లర్ జానెర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో అద్భుతమైన రికార్డులను సృష్టించడం విశేషం. చంద్రముఖి సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా చంద్రముఖి 2 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

చంద్రముఖి 2 సినిమాలో రజనీకాంత్ స్థానంలో నటుడు రాఘవ లారెన్స్ నటించిన బోతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇదివరకు ఈ సినిమా మైసూర్ లో కొన్ని షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాదులో జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న చంద్రముఖి సినిమాలో బాలీవుడ్ నటి కాంట్రవర్సీ క్వీన్ కంగనా నటించబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించే అవకాశాన్ని ఈమెకు కల్పించారని సమాచారం త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఈ విషయం అధికారకంగా వెల్లడించనున్నారు. కంగనా పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈమె సినిమాల పరంగా మాత్రమే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తుంటారు.