క‌మ‌ల్ హాస‌న్ బ్ర‌ద‌ర్‌ పుట్టిన‌రోజు వేడుక‌లు

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్  అన్న‌య్య.. వెట‌రన్ న‌టుడు చారు హాస‌న్ 90వ‌ పుట్టిన రోజు వేడుక‌లు జ‌న‌వ‌రి 5న  చెన్నైలో ఘ‌నంగా జ‌రిగిన విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. జ‌న‌వ‌రి 5తో చారుహాస‌న్ 90 వ వ‌సంతంలోకి అడుగు పెట్టారు.  ఈ వేడుక‌ల‌కు  అళ్వారావు పేట‌లోని క‌మ‌ల్ ఇల్లు వేదికైంది. వేడుక‌ల్ని క‌మ‌ల్ ద‌గ్గ‌రుండి నిర్వ‌హించారు.  ఈవేడుక‌ల‌కు ప‌లువురు కోలీవుడ్ తార‌లు హాజ‌ర‌య్యారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌తీస‌మేతంగా హాజ‌ర‌య్యారు. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా కూడా హాజ‌రై చారు హాస‌న్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇంకా న‌టి సుహాసినితో పాటు చారుహాస‌న్ స్నేహితులు హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లువురు తార‌లు చారుహాస‌న్ కు జ‌న్మదిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా తారలంతా క‌లిసి దిగిన  ఫోటోలు సోష‌ల్ మీడియాలోజోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అలాగే  అన్న‌య్య  వేడుక‌కు వ‌చ్చిన వారంద‌రికీ క‌మ‌ల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మా అంద‌రికీ అన్న‌గా..మార్గ‌ద‌ర్శిగా..తండ్రిగా..విప్ల‌వ‌కారుడిగా జీవిస్తోన్న అన్న చారు చారు హాసన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చారు హాస‌న్ న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. తెలుగ‌, త‌మిళ్, మ‌ల‌యాళ భాష‌ల్లో న‌టించారు.

తెలుగులో మాతృదేవో భ‌వ- శుభోద‌యం- సూర్య ఐపీఎస్- నిర్ణ‌యం- అంకురం- మౌనం సినిమాల్లో న‌టించారు ఇటీవ‌ల కాలంలో బ‌న్నీ న‌టించిన నాపేరు సూర్య‌లో  ఓ కీల‌క పాత్ర పోషించారు. అలాగే యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన డియ‌ర్ కామ్రేడ్ లోనూ గ్రాండ్ ఫాద‌ర్ పాత్ర‌లో న‌టించారు. 90 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనూ చారు హాస‌న్ న‌టించడం విశేషం.  చారు హాస‌న్ – ఇళ‌య‌రాజాకు  మంచి సాన్నిహిత్యం ఉంది.  చారు హాస‌న్ బ‌ర్త్ డే  వేడుక‌ల‌కు ఇళ‌య‌రాజా క్ర‌మం త‌ప్ప‌కుండా  హాజ‌ర‌వుతుంటారు.