సినిమా ఇండస్ట్రీలో స్టార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికి అందరూ సక్సస్ కాలేరు. ఈ విషయం చాలామంది నటీ, నటులలో నిరూపితం అయింది. అయితే కొన్ని సార్లు ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి.. అన్న సామెత మాదిరిగా కొంతమంది మాత్రం కెరీర్ ప్రారంభంలో ఘోరమైన అవమానాలు పడ్డప్పటికీ స్టార్స్ గా ఒక వెలుగు వెలుగుతారు. అలాంటి వాళ్ళలో లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ కూడా ఉంది.
శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్. సింగర్, యాక్టర్ గా చాలా టాలెంట్ ఉన్న అమ్మాయి. కమల్ కి తగ్గ కూతురుగా ఇప్పుడు అందరూ పొగుడుతుంటారు. కాని కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా పనికిరాదని కామెంట్ చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అందుకు కారణం శృతి హాసన్ స్టార్టింగ్ లో చేసిన సినిమాలు సక్సస్ కాకపోవడమే. బాలీవుడ్ లో మొదటి సినిమా ‘లక్’. ఈ సినిమా ఘోరంగా ఫ్లాపయింది.
ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమాలో సిద్దార్థ్ హీరోగా నటించాడు. కాని ఈ సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలింది. ఆ తర్వాత సూర్య కి జంటగా సెవెంత్ సెన్స్ అన్న సినిమా చేసింది. ఈ సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది. దాంతో ఐరెన్ లెగ్ అని కామెంట్ చేశారు.
అయితే తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా టాలీవుడ్ లో పెద్ద కమర్షియల్ సక్సస్ ని అందుకొని ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది. అప్పటి వరకు శృతిహాసన్ ని ఐరెన్ లెగ్ అన్నవాళ్ళే ప్రశంసలతో ముంచేశారు. వరసగా స్టార్స్ తో నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ప్రస్తుతం మాస్ మహారాజా తో క్రాక్ సినిమా, అలాగే మరోసారి పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చేస్తోంది.