ప్రాజెక్ట్ కె లో కమల్ హాసన్… అసలు క్లారిటీ ఇదే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ గా ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తోన్నారు. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం సిద్ధం అవుతోంది. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ప్రాజెక్ట్ కె మూవీ కథ ఉంటుందనే ప్రచారం ఉంది.

అలాగే ఇండియన్ మైథాలజీలోని క్యారెక్టర్స్ ని మోడ్రనైజ్ చేసి ఫ్యూచర్ లో చూపించే ప్రయత్నం నాగ్ అశ్విన్ చేయబోతున్నారంట. ఇదిలా ఉంటే ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ లార్డ్ పరశురామ్ పాత్రలో నటిస్తున్నారని టాక్ ఉంది. అలాగే దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్ గా కనిపించబోతున్నారు. భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై నాగ్ అశ్విన్ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా ఈ మూవీలో కమల్ హాసన్ నటించబోతున్నారు అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రాజెక్ట్ కె లో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారని, 30 రోజుల కాల్ షీట్స్ కోసం ఏకంగా 150 కోట్ల రెమ్యునరేషన్ నిర్మాత అశ్వినీదత్ ఇస్తున్నారంటూ తమిళ్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తోంది. ఈ టాక్ సోషల్ మీడియాకి కూడా స్ప్రెడ్ అయిపొయింది.

అయితే ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదంట. అసలు ప్రాజెక్ట్ కె టీమ్ నుంచి ఎవరూ కూడా కమల్ హాసన్ ని సంప్రదించనే లేడని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా 75శాతం కంప్లీట్ అయిపొయింది. విలన్ ఎవరనేది రివీల్ చేయకపోయిన ఆల్రెడీ అతనికి సంబందించిన సీక్వెన్స్ కూడా షూటింగ్ కంప్లీట్ అయ్యాయని తెలుస్తోంది. కమల్ హాసన్ ని సంప్రదించారనే వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ వచ్చినట్లు టాక్.

కమల్ హాసన్ సినిమాల్లో నటిస్తున్నాడు అనేది కేవలం ప్రచారం మాత్రమే అని కొట్టిపారేసారంట. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కె సినిమాని జనవరి 12న వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 12 భాషలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ లో కూడా ఈ చిత్రాన్ని మొదటిసారిగా ఇండియా నుంచి డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్నారంట.