ఇండియన్ సినిమా దగ్గర భారీ క్రేజ్ అండ్ ఫేమ్ ఉన్నటువంటి అతి కొద్ది మంది హీరోస్ లో మన సౌత్ నుంచి కూడా అనేకమంది ఉన్నారు. మరి అలాంటి స్టార్ హీరోల్లో సీనియర్ స్టార్ నటుడు ఉలగనయగన్ కమల్ హాసన్ కూడా ఒకరు. మరి కమల్ హాసన్ హీరోగా ఇప్పుడు వరుసగా పలు భారీ చిత్రాలు సెట్ చేసుకొని ఉన్నారు.
మరి వీటిలో శంకర్, మణిరత్నం లాంటి స్టార్ దర్శకులు మాత్రమే కాకుండా కోలీవుడ్ నాట యంగ్ దర్శకుడు హెచ్ వినోద్ కూడా ఉన్నాడు. మరి ఈ దర్శకుడు అయితే తమిళ్ లో వలిమై, తూనీవు, ఖాకీ లాంటి ఇంటెన్స్ చిత్రాలు తెరకెక్కించి ఇపుడు కమల్ హాసన్ కెరీర్ లో 233వ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కించుకున్నాడు.
ఇక ఈ చిత్రంపై అయితే ఓ సెన్సేషనల్ న్యూస్ ఇపుడు వైరల్ గా మారింది. మరి తమిళ సినీ వర్గాలు చెప్తున్నా న్యూస్ ప్రకారం అయితే ఈ చిత్రం ఓటిటి హక్కులని ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేశారట. మరి అనూహ్యంగా ఈ సినిమాకి మన ఇండియన్ సినిమా దగ్గరే భారీ ధర పలికినట్టుగా తెలుస్తుంది.
కాగా ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ వారు ఏకంగా 125 కోట్ల మొత్తం ఇచ్చి ఆ హక్కులు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ భారీ సినిమాకి జరిగిన సెన్సేషనల్ డీల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ చిత్రం అయితే ఓ సోషల్ డ్రామాగా తెరకెక్కనుందట. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది.