నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి ఇటీవల వచ్చిన సినిమా ‘అమిగోస్’ బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థకి తగిలిన పెద్ద డిజాస్టర్ ఇది. ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే చేశారుగానీ, అన్ని చోట్లా నష్టాలొచ్చాయ్.
మరీ దారుణమైన రిజల్ట్ ఇది. దాంతో, ‘అమిగోస్-2’ విషయంలో నిర్మాణ సంస్థ లైట్ తీసుకోక తప్పలేదు. మైత్రీ కాకపోతే.. తానే సొంతంగా ‘అమిగోస్-2’ తీయాలనుకున్నాడుగానీ, ఆ ఆలోచనని కూడా కళ్యాణ్‌రామ్ పక్కన పెట్టేశాడట. ఇక, ఇప్పుడు ‘బింబిసార’ మీద కళ్యాణ్ రామ్ మళ్ళీ ఫోకస్ పెట్టాల్సి వస్తోందిట. నాలుగైదు పార్టులు ‘బింబిసార’ నుంచి వస్తాయని గతంలోనే ప్రచారం జరిగింది. ‘బింబిసార’తో తన మార్కెట్ పెరిగిన దరిమిలా, బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే అదే తనకు అసలు సిసలు అస్త్రమని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడట.
అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘బింబిసార-2’ మీద ఫోకస్ పెట్టినా, కళ్యాణ్ రామ్ మార్కెట్ స్టేబుల్ అయ్యే అవకాశాల్లేవు. మొత్తంగా చూస్తే, ‘అమిగోస్’తో కళ్యాణ్ రామ్ తప్పులో కాలసినట్టే. ‘అమిగోస్’ వర్కవుట్ అవదని, శ్రేయోభిలాషులు చెప్పిన మాటల్ని కళ్యాణ్‌రామ్ పెడ చెవిన పెట్టడం వల్లే ఈ దుస్థితి అనుకోవచ్చా.?