జాతీయ అవార్డులు అందుకున్న సందర్భంగా సూర్య జ్యోతికలకు కాజల్ శుభాకాంక్షలు?

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రకటించ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఈ ఏడాది కూడా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే 68వ జాతీయ చలనచిత్ర పురస్కార వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే నటుడు సూర్య నటి జ్యోతిక ఈ పురస్కారాలను అందుకున్న విషయం మనకు తెలిసిందే. సుధా కొంగర దశకత్వంలో సూర్య నటించిన సురారై పోట్రు సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు ఇక ఈ సినిమాని స్వయంగా సూర్య భార్య జ్యోతిక నిర్మించారు.

ఈ క్రమంలోనే జాతీయ చలన పురస్కారాలలో భాగంగా ఈ సినిమా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా సూర్యా జ్యోతిక ఇద్దరు కూడా జాతీయ అవార్డులను అందుకోవడంతో ఎంతోమంది అభిమానులు ఇతర సెలబ్రిటీలు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి కాజల్ అగర్వాల్ కూడా ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సోషల్ మీడియా వేదికగా కాజల అగర్వాల్ స్పందిస్తూ జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నందుకు అభినందనలు ఈ అవార్డును అందుకోవడానికి మీరే సరైన అర్హులు అంటూ ఈ సందర్భంగా కాజాల అగర్వాల్ నటుడు సూర్య నటి జ్యోతికకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.జాతీయస్థాయి అవార్డు రావడం ఎంతో సంతోషంగా భావిస్తారు. అలాంటిది ఒకే సినిమాకు ఐదు అవార్డులు రావడం అందులో సూర్య జ్యోతిక ఇద్దరూ కూడా ఈ అవార్డులను అందుకోవడంతో వీరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.