ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో ఆనందాలు, విషాదాలు రెండు జరిగాయి. కరోనా వలన ఎందరో ప్రముఖులు మృత్యువాత పడగా, వారి మరణం సినీ ప్రియులకి తీరని విషాదాన్ని మిగిల్చింది. అలానే ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న హీరోలు, హీరోయిన్స్ దర్శకులు పెళ్లి పీటలు ఎక్కారు. దిల్ రాజు, నిఖిల్, రానా, నితిన్ వంటి ప్రముఖులు కరోనా సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకొని పెళ్ళి చేసుకున్నారు. ఇక మెగా హీరోయిన్ నిహారిక, కలువ కళ్ల సుందరి కాజల్ మరి కొద్ది రోజులలో పెళ్ళి పీటలెక్కనున్నారు. అయితే కాజల్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన పెళ్ళి విషయాన్ని కన్‌ఫాం చేయడంతో ఆమె అభిమానులు ఆనందంలో మునిగి తేలారు.
వెండితెర చందమామగా అభివర్ణింపబడుతున్న కాజల్ యువతరంలో చక్కటి అభిమానగణాన్ని సంపాదించుకుంది. ముంబయిలో గుర్తింపుపొందిన వ్యాపారవేత్త, ఇంటీరియర్ డిజైనర్, ఫ్యాషన్ ఈ కామర్స్ వెబ్‌సైట్‌ను గడిపిస్తున్న గౌతమ్ కిచ్లును కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న మనువాడనుంది. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన ప్రేమవివాహమని చెబుతున్నారు. గౌతమ్‌కిచ్లుతో కాజల్ అగర్వాల్‌కు కొన్నేళ్ల నుంచి పరిచయం ఉందని, పెద్దల అంగీకారంతో ఈ జంట వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారని అంటున్నారు.
కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లుల వివాహం ముంబయిలోని ప్రఖ్యాత ఏడునక్షత్రాల హోటల్‌లో జరగనున్నట్టు సమాచారం. వస్త్ర వ్యాపారంలో ఉన్న కాజల్ అగర్వాల్ అమ్మనాన్న సుమన్ అగర్వాల్, వినయ్ అగర్వాల్ ఈ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటి వరకు కాజల్, గౌతమ్‌లు కలిసి ఉన్న పాత ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా, తాజాగా ఇద్దరు కలిసి దిగిన రీసెంట్ ఫోటోలను దసరా పర్వదినాన కాజల్ షేర్ చేసింది. ఇందులో కాజల్-గౌతమ్‌లు ఒకేరంగు దుస్తులు ధరించి ఉన్నారు. చాలా చనువుగా కాబోయే భర్తతో దిగిన కాజల్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.