Naga Chaitanya’s Heroine : అక్కినేని హీరో నాగచైతన్యతో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ మంజిమా మోహన్. ఆ సినిమా ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు పోయిందో పెద్దగా ఎవ్వరికీ తెలియదనుకోండి. కానీ, మలయాళ భామ కదా.. బాగా నటించేసింది. కనిపించింది ఒకే ఒక్క సినిమానే అయినా బాగానే గుర్తు పెట్టుకున్నారు తెలుగు సినీ జనం మంజిమ మోహన్‌ని.
కానీ, ఇంకో తెలుగు సినిమాలో అమ్మడు కనిపించిందే లేదు. తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో సినిమాలు చేస్తోంది మంజిమా మోహన్. కాగా, అమ్మడి ఇంట్రెస్టింగ్ లవ్‌స్టోరీ ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది. తమిళ హీరో గౌతమ్ కార్తీక్‌తో మంజిమ లవ్‌లో వుందనే రూమర్ ఒకటి ప్రచారంలో వుంది.
2019 లో ‘దేవరట్టం’ అనే ఓ తమిళ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా టైమ్‌లోనే వీరిద్దరి మధ్యా స్నేహం కుదిరి అది లవ్వుగా మారిందనీ, ప్రస్తుతం ఈ జంట సహజీవనంలో వుందనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు.
ఈ విషయంపై తాజాగా మంజిమా మోహన్ రెస్పాండ్ అయ్యింది. ‘గౌతమ్ చాలా మంచి వ్యక్తి.. నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి.. తనతో వుంటే సెక్యూర్‌డ్‌గా వున్నట్లు ఫీలవుతాననీ చెప్పింది. కానీ, పెళ్లికి మాత్రం చాలా టైముందనీ, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం తనకు లేదనీ కుండ బద్దలుకొట్టేసింది.
హీరోయిన్ల అందాల ఆరబోత విషయంలో విప్పీ విప్పనట్లుగా, చూపించీ చూపించనట్టుగా.. అనే ఓ పోలిక వుంటుంది చూడండి.. ఆ టైపులో మంజిమా మోహన్ తన లవ్వు గుట్టు విప్పీ విప్పనట్లుగా విప్పి చెప్పిందనుకోవాలేమో. అదీ సంగతి.