Samantha: బిడ్డకు జన్మనిచ్చిన కాజల్… కాజల్ తో పోలుస్తూ సమంతను ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్..!

Samantha: నటి కాజల్ అగర్వాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా కాజల్ అగర్వాల్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ ను పోలుస్తూ నెటిజన్లు పెద్దఎత్తున నటి సమంతను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు మీమర్స్ సోషల్ మీడియా వేదికగా మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ ను పొగుడుతూ మీరు.. సూపర్ మేడం చక్కగా పెళ్లి చేసుకొని పిల్లోడికి జన్మనిచ్చారు. కొందరు ఉంటారు మొగుడు కన్నా కుక్కలే ఎక్కువ అంటూ సమంతను దారుణంగా తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే నాగచైతన్య సమంత పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు ఊసే ఎత్తలేదు.

ఇలా నాలుగు సంవత్సరాల తర్వాత వీరిద్దరు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే సమంత చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఎక్కువగా తన కుక్క పిల్లలకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూఉంటారు. ఈ క్రమంలోనే నెటిజనులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా మీమ్స్ క్రియేట్ చేసి సమంతను దారుణంగా ఏకిపారేస్తున్నారు.