Kajal Agarwal : ఆచార్య లో కాజల్ ఉందా లేదా…ట్రైలర్ లో లేకపోవడంతో అభిమానుల నిరాశ…!

Kajal Agarwal : మెగాస్టార్ చిరు, ఆయన తనయుడితో నటిస్తున్న తొలి చిత్రం ఆచార్య. కొరటాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చిరుకి జోడిగా కాజల్ నటిస్తోంది. రామ్ చరణ్ కి జోడిగా పూజ హెగ్డే నటిస్తోంది. కానీ ఇటీవల విడుదలైన ట్రైలర్ లో కాజల్ ను ఒక్కసారిగా కూడా చూపించక పోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందారు. అయితే అసలు కాజల్ సినిమాలో ఉందొ లేదో అన్న అనుమానాలు మొదలయ్యాయి.2.33 నిమిషాల ట్రైలర్‍లో కాజల్ పాత్ర గురించి కాస్త కూడా చూపించలేదు.

ఒక్కటంటే ఒక్క సన్నివేశంలోనూ కాజల్ కనిపించలేదు. దీంతో ఆమె అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. కాజల్ పాత్ర గురించి చూపకపోవడం సరికాదంటూ పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే కాజల్ కూడా సినిమా ట్రైలర్ ను తన ఖాతాలో షేర్ చేయకపోవడంతో ఇంకా అనుమానాలు పెరిగాయి.

కాజల్ కొన్ని సన్నివేశాల్లో నటించి తరువాత కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడటం, ఆ తర్వాత కాజల్ ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల సినిమాకు సంబంధించిన తన భాగం పూర్తి చేయలేదు పైగా వచ్చి షూటింగ్ పూర్తి చేయమని అడిగిన చిత్రం యూనిట్ కి సహకరించలేదట. దీంతో మేకర్స్ కావాలనే కాజల్ సన్నివేశాలను ట్రైలర్లో చూపించలేదట. ఇక సినిమాలో కూడా తన సన్నివేశాలను తొలిగించారనే వార్తలు వస్తున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విడుదలైతే కానీ సినిమాలో కాజల్ ఉందొ లేదో తెలియదు.