కాజల్‌తో సినిమా అంటే తలనొప్పే.!

పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్‌తో సినిమా అంటే నిర్మాతలకు పెద్ద తలకాయ నొప్పిలా మారిందట. సవాలక్ష కండిషన్లు పెడుతోందట కాజల్ అగర్వాల్. ప్రస్తుతం బాలయ్యతో ఓ సినిమాలో నటిస్తోంది కాజల్ అగర్వాల్. ఈ సినిమా ఒప్పుకోవడానికి కూడా రకరకాల కండిషన్లు పెట్టిందట.

అంతకు ముందు ఒప్పుకున్న ‘ఆచార్య’ సినిమాకీ కాజల్ అలాగే షరతులు విధించిందట. తీరా రిలీజ్ అయ్యాకా చూస్తే ఆ సినిమాలో కాజల్ కనిపించలేదు.

అలాగే, బాలయ్య సినిమా పరిస్థితి కూడా రిలీజ్ అయ్యేంత వరకూ తెలీదు. అయితే, కాజల్‌కి బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయట. ఈ మధ్యనే ఓ పెద్ద హీరో సినిమా కోసం కాజల్‌ని అప్రోచ్ అయితే, అలాగే కండిషన్స్ అప్లై అని విసిగించిందట.

అంతేకాదు, రెమ్యునరేషన్ విషయంలోనూ కాజల్ తగ్గేదేలే అంటోందట. కాజల్ గురించి ఇలాంటి ప్రచారం జరుగుతోన్నా, డిమాండ్ అలా వుంది మరి. సో, కాజల్ షరతులు పెట్టడంలో తప్పేం లేదు.!