ఈ మధ్య ఓ సినిమా ఫంక్షన్‌కి కాజల్ అగర్వాల్ కొడుకును తీసుకుని వచ్చిందట. అదే ఇప్పుడు కాజల్‌కి షాక్ ఇచ్చిన ఇష్యూ. అదేంటీ.! కొడుకును తీసుకొస్తే అది షాకింగ్ ఇష్యూ ఎలా అవుతుందనుకుంటున్నారా.?
అక్కడే అసలు ట్విస్ట్. అలా కొడుకుని తీసుకుని వస్తే, హీరోయిన్‌గా నీకు అవకాశాలెలా వస్తాయ్.. అంటూ ఆ ఫంక్షన్‌లో ఓ సినీ ప్రముఖుడు కాజల్‌ని డైరెక్ట్‌గా క్వశ్చన్ చేసేశాడట.
అందుకు కాజల్ అగర్వాల్ ఘాటుగా సమాధానమిచ్చిందట. కొడుకును తీసుకుని రావడం అన్నది నా ఇష్టం.. అని బదులిచ్చిందట కాజల్ అగర్వాల్. అసలింతకీ ఎవరా సినీ ప్రముఖుడు.? ఏంటా కథ.?
అయినా ఆ సినీ ప్రముఖుడు అంత మాట ఎలా అనగలిగాడు కాజల్ అగర్వాల్‌ని. కాజల్ మీదున్న అతి చనువు కారణమా.? లేక ఇంకేదైనా కారణమా.?
కారణమేదైనా ఆ సినీ ప్రముఖుడు అలా అనడంలో అర్ధం లేదు. ఆ వ్యక్తి ఎంతటోడైనా కాజల్‌ని అంత మాట ఎలా అనేస్తాడంటూ సోషల్ మీడియా వేదికగా సదరు వ్యక్తిపై చిర్రు బుర్రులాడుతున్నారట కాజల్ ఫ్యాన్స్.
కెరీర్ పీక్స్‌లో వున్నప్పుడే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంది. ఆలస్యం చేయకుండానే ఓ బిడ్డకి జన్మనిచ్చింది కూడా. తాను తల్లి కానున్న తొలి క్షణం నుంచీ ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ నెటిజన్లతో పంచుకుంటూ చాలా చాలా ఎంజాయ్ చేసింది.
అలాంటిది హైద్రాబాద్‌కి తన కొడుకుతో రావడం ఏమంత పెద్ద పొరపాటు.? అయినా కాజల్‌కి ఇప్పుడేమంత అవకాశాల కరువు.? ప్రస్తుతం ఆమె చేతిలో రెండు బిగ్ ప్రాజెక్టులున్నాయ్. అందులో ఒకటి బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ కాగా, ఇంకోటి విశ్వనటుడు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’.
రేపో మాపో మెగాస్టార్ చిరంజీవితోనూ నాగార్జున, వెంకటేష్‌తోనూ కాజల్ స్ర్కీన్ షేర్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందీ సంగతి.