ఏంది కాజల్.. ఇలా భయపెడుతున్నావ్.. కొంపదీసి పిశాచిగా నటిస్తున్నావా ఏంది?

kajal aggarwal new web series live telecast first look

మూడు పదుల వయసు దాటినా.. నేటి కుర్ర హీరోయన్లకు తీసిపోకుండా.. అదే అందాన్న మెయిన్ టెన్ చేస్తూ.. వాళ్లకు గట్టి పోటీనిస్తూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటోంది కాజల్ అగర్వాల్. తన సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించింది కాజల్. తెలుగుతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన కాజల్ అగర్వాల్ మొట్టమొదటి సారి ప్రేక్షకులను భయపెట్టబోతోంది. అది కూడా ఓ వెబ్ సిరీస్ లో.

kajal aggarwal new web series live telecast first look
kajal aggarwal new web series live telecast first look

తను మొట్టమొదటి సారి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోందది. ఆ వెబ్ సిరీస్ పేరు లైవ్ టెలికాస్ట్. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ డిస్నీలో టెలికాస్ట్ కానుంది.

అయితే.. తాజాగా తన తొలి వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కాజల్ తన అభిమానులతో పంచుకుంది. ఆ ఫస్ట్ లుక్ లో కాజల్ పిశాచిలా ఉంది.

kajal aggarwal new web series live telecast first look
kajal aggarwal new web series live telecast first look

తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాడడు. హారర్ జానర్ లో ఈ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ వెబ్ సిరీస్ తమిళంతో పాటుగా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీలో విడుదల కానుంది. ఈ వెబ్ సిరీస్ తో పాటు కాజల్.. ప్రియాంక చోప్రా నటించిన క్వాంటికో వెబ్ సిరీస్ రీమేక్ లోనూ కాజల్ నటించనుంది.

ఇవన్నీ పక్కన పెడితే.. కాజల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను తను అక్టోబర్ 30న వివాహమాడబోతోంది.