Kajal Agarwal : ఆచార్య నుండి నవ్వుతూ తప్పుకున్న కాజల్..!

Kajal Agarwal : ఆచార్య సినిమా ప్రచారాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. సినిమా గురించిన వివరాలపై ఇంత ఆసక్తిగా ప్రశ్నలు వస్తున్నాయో అంతే ఇదిగా కాజల్ సినిమాలో ఉందా లేదా అనే విషయం పై చర్చ నడుస్తోంది. ఇక ప్రచార కార్యక్రమాల్లో కాజల్ ఊసే ఎత్తక పోవడంతో ఇక అసలు కాజల్ సినిమాలో లేదేమో అన్న అనుమానాలు బలపడ్డాయి. ఇక ఈ ఇష్యూ పై కొరటాల క్లారిటీ ఇచ్చేవరకు కాజల్ ముచ్చట హాట్ టాపిక్ అయింది.

ఇక కొరటాల శివ పలు ఇంటర్వ్యూ ల్లో మాట్లాడుతూ కాజల్ సినిమాలో లేదనే విషయాన్నీ స్పష్టం చేసారు. సినిమాలో ఆచార్య పాత్రలో రొమాంటిక్ యాంగిల్ బాగోదని కొన్ని సన్నివేశాలను కాజల్ తో చిత్రీకరించాక అనిపించి ఈ విషయాన్నే చిత్రం యూనిట్ కు మరియు కాజల్ కు వివరించామని కాజల్ ఈ విషయంలో అర్థం చేసుకుని తప్పుకుందని కొరటాల వివరించారు.

ఇక కాజల్ కు ఆచార్య ప్రాజెక్టు నుంచి తప్పిస్తున్నట్లు దర్శకుడు కొరటాల శివ చెప్పగానే ఆమె వెంటనే రియాక్షన్ ఇచ్చిందట. కాజల్ ఆ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా చిరునవ్వుతోనే ఆ నిర్ణయాన్ని అంగీకరించినట్లు చెప్పిందట. షూటింగ్ లో నేను మీ అందరిని మిస్ అవుతాను అంటూ భవిష్యత్తులో మాత్రం తప్పకుండా మీతో కలిసి పని చేయాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పినట్లుగా కొరటాల శివ కూడా వెంటనే వివరణ ఇచ్చాడు. ఇలా కాజల్ విషయంలో ఆమె అభిమానులకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది.

ఇక కరోనా లాక్ డౌన్ ముందు షూటింగ్ జరిగినా లాహే లాహే పాటలో కాజల్ ఉంది. ఇక వీడియో సాంగ్ ప్రోమోలో సంగీతం తో పాటు కాజల్ కూడా కనిపించింది. ఇక ఇపుడు ఆ పాటలో కాజల్ ఉందా లేదా అన్న విషయం కొరటాల ను అడుగగా సినిమా చూసి మీరే తెలుసుకోండని సస్పెన్స్ లో పెట్టేసారు. ఇక తొలిసారి చిరు రైతు లు కలిసి నటిస్తుండడం తో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.