షాకింగ్ : కొరటాలకి న్యాయం చెయ్యాలి.. “ఆచార్య” లాసులపై..

Koratala Siva quits social media

టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్  సక్సెస్ ఫుల్ దర్శకుల్లో కొరటాల శివ కూడా ఒకరు. అయితే కొరటాల శివ ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చేయగా తన కెరీర్ లో అసలు ఊహించని మలుపు గా భారీ డిజాస్టర్ “ఆచార్య” తో అందుకోవాల్సి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి మణిశర్మ తో సినిమా అందులోని కొరటాలతో అంటే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మళ్ళీ పైగా మరో మెగా స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా యాడ్ అవ్వడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. కానీ సీన్ కట్ చేస్తే ఈ సినిమాపై అసలు ఊహించని రేంజ్ లో డిజాస్టర్ అయ్యిపోయింది. అయితే ఈ సినిమాకి వచ్చిన భారీ నష్టాలను కొరటాల శివనే తీరుస్తుండగా ఇప్పుడు కొంతమంది కొరటాల పై ఓ రేంజ్ లో సింపతీ కనబరుస్తున్నారు.

కొరటాలకి న్యాయం చెయ్యాలి అని సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేస్తూ కొరటాలకి అండగా ఉన్నారు. అయ్యితే ఇది కొరటాలపై ప్రేమతోనో లేక మెగా స్టార్ పై నెగిటివిటి తోనో గాని మొత్తానికి అయితే చాలా మందే ఈ క్రేజీ ట్రెండ్ చేస్తున్నారు. దీనితో ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.. ఇంకా మరోపక్క కొరటాల అయితే చాలా మంది బయ్యర్లకు కొంతమేర వెనక్కి ఇచ్చాడని టాక్ ఉంది.