Ramcharan – NTR: భిన్న ధ్రువాలు ఆకర్షించిన విధంగానే మా మనస్తత్వాలు కూడా… ఎన్టీఆర్ కామెంట్స్!

Ramcharan – NTR: టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజ్ ఉన్న స్టార్స్ అంటే అది మెగా ఫ్యామిలీ మరియు నంద‌మూరి ఫ్యామిలీ అనే చెప్పాలి. ఆ కుటుంబాలకు చెందిన హీరోలు చేసిన సినిమాలు గనక ఒకేసారి విడుదల కావాల్సి వస్తే.. ఇంకేముంది ? అసలు పోటీ అక్కడే మొదలవుతుంది. నువ్వా నేనా అని సాగే వారి పోటీ మధ్య ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టమే. ఇక అలాంటిది ఆ రెండు ఫ్యామిలీస్‌కు చెందిన స్టార్స్ కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే చాలా బాగుంది కదా. ఇక ఆ ఊహను నిజం చేయడానికి వస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్. ఇప్పటి వరకూ త‌మ సినిమాల‌తో ప్రేక్షకులను అలరించిన ఈ యంగ్ హీరోలు ఇప్పుడు తమ నటనా విశ్వరూపాన్ని ప్రదర్శనతో అభిమానుల హృదయాలను మరోసారి కొల్లగొట్టడానికి సిద్ధమయ్యారు.

ఇక విషయానికొస్తే మోస్ట్ పాపులర్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, తారక్‌లు ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. బాహుబలి తర్వాత అంతటి స్థాయిలో భారీ అంచనాల మధ్య మార్చి 25న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్న విషయం అందరీకీ తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి సంబంధించి ఇప్పటికే ట్రైలర్, మేకింగ్ వీడియో, పాటలు రిలీజ్ కావడంతో సినిమా విడుదలకు ముందే మూవీ మేకర్స్ సగం విజయాన్ని పొందినట్టుగా ఫీలవుతున్నారు.

ఇకపోతే చెర్రీ, తారక్‌ల విషయానికొస్తే వారిద్దరూ ఈ సినిమా షూటింగ్‌లో బాగా క్లోజ్‌గా అయ్యారని చాలా మంది భావిస్తారు గానీ, వీరి మధ్య స్నేహం అంతకుముందు నుంచే ఉందని వారివురు స్పష్టం చేశారు. భిన్న ధృవాలు ఎలా ఆకర్షిస్తాయో అలా తమ మనస్తత్త్వాలు కలిశాయని వారు చె‌ప్పారు. తన భార్య ప్రణతి పుట్టినరోజు తరువాతి రోజే చరణ్ పుట్టినరోజు అన్న తారక్, అర్థరాత్రి 12 గంటలకు గేట్ దగ్గర అప్పటికే ఎదురు చూస్తున్న చరణ్‌తో కలిసి వెళ్లిపోయేవాడినని ఎన్టీఆర్ అన్నారు. చరణ్-తారక్ మధ్య అసలు స్నేహం ఏర్పడడానికి మూల కారణం టాలీవుడ్ సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ అని, అక్కడే వారి స్నేహానికి బీజం పడిందని వారు చెప్పారు. ఇదిలా ఉండగా ఇంకా కొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసేందుకు బిజీగా గడుపుతున్నారు ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందం.