పుష్ప 2.. గెస్ట్ రోల్ అంటున్నారే?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ ఈ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పవర్ ఫుల్ విలన్ గా ఈ మూవీలో కనిపించబోతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

దీని తర్వాత బాలీవుడ్ లో వార్ 2 చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ లో తారక్ పాల్గొనే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీని సెట్స్ పైకి తీసుకు వెళ్ళనున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పుష్ప 2 మూవీ షూటింగ్ సెట్ లో ఆకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. హైదరాబాదులో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

అల్లు అర్జున్ మీద భారీ యాక్షన్ సీక్వెన్స్ ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ సెట్స్ లో తారక్ ప్రత్యక్షం కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కొత్త టాక్ తెరపైకి వచ్చింది. పుష్ప 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు అనే ప్రచారం సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో ఇతర స్టార్స్ గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తూ వస్తున్నారు. కమల్ హాసన్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో సూర్య రోలెక్స్ పాత్రలో కనిపించి మెప్పించారు. షారుక్ ఖాన్ పఠాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా పుష్ప 2 సినిమాల్లో సుకుమార్ అలాంటి గెస్ట్ రోల్ ఏదైనా ట్రై చేస్తున్నాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. ఇద్దరు కూడా ఒకరికి ఒకరు బావ అని పిలుచుకుంటారు. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కు బర్త్ డే విషెస్ కూడా డిఫరెంట్ గా చెప్పారు. ఈ నేపథ్యంలో పుష్ప టు షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మరోసారి సుకుమార్ పుష్ప 2లో తారక్ కోసం ఇంట్రెస్టింగ్ రోల్ ఏదైనా క్రియేట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది.