అతనో యంగ్ ప్రొడ్యూసర్. ఓ హాలీవుడ్ సినిమాకి చెత్త రివ్యూ ఇచ్చి వార్తల్లోకెక్కాడు. మెగా కాంపౌండ్‌లో ఓ పవర్‌ఫుల్ హీరోతో సినిమానూ నిర్మించాడు. నోటి దూల ఎక్కువ కావడంతో ఈ మధ్య తరచూ వివాదాల్లోకెక్కుతున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఎవరు బెస్ట్ డాన్సర్ అన్న క్వశ్చన్ ఆ నిర్మాత ముందుకొస్తే, ‘నాకైతే ఎన్టీయార్ ఇష్టం’ అన్నాడట. అది కూడా ‘నాటు నాట’ పాట గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు, ‘చరణ్ కూడా ఎన్టీయార్‌తో సమానంగా చేశాడు కదా.?’ అంటే, ‘అయితే ఏంటి.? నాకైతే చరణ్ డాన్స్ నచ్చలేదు.. ఎన్టీయార్ డాన్స్ నచ్చింది’ అన్నాడట.
కానీ, ఆ తర్వాత నాలిక్కరచుకుని, ‘ఇద్దరూ చాలామంచి డాన్సర్లు.. పోటా పోటీగా డాన్సులు చేశారు..’ అంటూ కవరింగ్ డైలాగ్ ఇచ్చాడట. ఈ వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
చిత్రమేంటంటే ఆ నిర్మాతే ఎన్టీయార్, రామ్ చరణ్.. ఇద్దరికీ అడ్వాన్సులు ఇచ్చి వుండడం. నోటి దూల దెబ్బకి, చరణ్ నుంచి ఎలాంటి మెగా కౌంటర్ ఎటాక్ వస్తుందో ఆ యంగ్ ప్రొడ్యూసరుకి.