ఇదే ఇదే ఇలాంటి సినిమాలే కావాలి తారక్ .. తోపు డైరెక్టర్ కి సంతకం పెట్టిన తారక్ !

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమా అంటే ఆ క్రేజే వేరు. ఎన్టీఆర్‌ నట విశ్వరూపం, డ్యాన్స్‌లు చూడాలనే ఆసక్తి అందరిలోను నెలకొంటుంది. అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ మెస్మరైజ్‌ చేయగల కెపాసిటీ ఎన్టీఆర్‌ చిత్రానికి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక యంగ్‌టైగర్‌ మూవీ ఆంటే బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీని చూస్తుంటాం. ఎన్టీఆర్‌ సినిమాకు సంబంధించిన ప్రతీ అంశం ఎంతంటి ట్రెండ్‌ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా మరో కథానాయికుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుంటే.. రామ్ చరణ్ మాత్రం అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో కానీ ఆ తర్వాత కానీ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

 

అయితే ఈ చిత్రం తర్వాత ఇటీవలే భారీ విజయాన్ని అందుకున్న యువ దర్శకుడితో కలిసి ప్యాన్ ఇండియన్ లెవల్లో హైబడ్జెట్‌ మూవీకి ఎన్టీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో యంగ్‌ టైగర్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని ఫిలింనగర్‌ టాక్‌. గతంలో బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘జై లవకుశ’ స్టైల్లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అన్ని వార్గల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పూర్తి స్క్రిప్ట్‌ను ఆ యువ దర్శకుడు సిద్దం చేస్తున్నాడట. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌ను ఎన్టీఆర్‌కు వినిపించి ఫైనల్‌ చేసి, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మరొకసారి వెండితెరపై ఎన్టీఆర్ త్రిపాత్రాభినయాన్ని చూడవచ్చు..!!