ఎన్టీఆర్ 30 నుంచి బర్త్ డే సర్ప్రైజ్

జూనియర్ ఎన్టీఆర్ హీరో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ మూవీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ ఆలీఖాన్ ప్రతినాయకుడుగా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యింది.

ఇదిలా మే హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే మే 20న రాబోతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ 30 నుంచి తారక్ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయనున్నారంట. నెవెర్ బిఫోర్ అనే విధంగా ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ మాస్ అవతార్ ఉంటుందంట. ఈ ఫస్ట్ లుక్ ని తారక్ బర్త్ డే సర్ప్రైజ్ గా కొరటాల ఆవిష్కరించడానికి రెడీ అయినట్లు టాక్.

తారక్ ఫ్యాన్స్ కూడా కూడా ఎన్టీఆర్ 30 నుంచి సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కి ట్రీట్ గా ఫస్ట్ లుక్ మోషన్ వీడియోని అందించనున్నారంట. దాంతో పాటు అదే రోజు టైటిల్ ని కూడా కూడా రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అన్ని భాషలకి కామన్ గా సరిపోయే విధంగా ఈ మూవీకి కొరటాల శివ అదిరిపోయే టైటిల్ ని పెట్టారంట.

ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ ని టైటిల్ లేకుండానే ప్రెజెంట్ చేయనున్నట్లు సమాచారం. తరువాత టైటిల్ ని మోషన్ వీడియో తో లాంచ్ చేస్తారంట. ఇలా రెండు బర్త్ డే ట్రీట్ లు తారక్ అభిమానులకి కొరటాల ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీతో గ్లోబల్ లెవల్ లో సోలోగా సక్సెస్ అందుకోవాలని తారక్ గట్టిగా కష్టపడుతున్నారు. స్క్రిప్ట్ పెర్ఫెక్షన్ కోసం ఏకంగా ఏడాది సమయం తీసుకున్నారు.

ఇక బర్త్ డే సందర్భంగా బాలీవుడ్ వార్ 2 నుంచి కూడా తారక్ అభిమానులకి ట్రీట్ ఇచ్చే అప్డేట్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ సినిమా కోసం సెప్టెంబర్ తర్వాత తారక్ డేట్స్ కేటాయించినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.