వకీల్ సాబ్ సెట్‌లో జానీ మాస్టర్.. అందుకే కలిశాడా?

జానీ మాస్టర్, శ్రీముఖి పవన్ కళ్యాణ్‌లతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తోన్నాయి. అయితే ఇలా శ్రీముఖి, జానీ మాస్టర్, గల్లీ బాయ్స్ రియాజ్ అందరూ కలిసి స్పెషల్‌గా కలిశారు. బొమ్మ అదిరింది టీంలో వీరంతా సభ్యులు. దానికి నాగబాబు హెడ్డు. నాగబాబు రికమండేషన్‌తోనే శ్రీముఖి, జానీ మాస్టర్, రియాజ్‌లు పవన్ కళ్యాణ్‌ను కలిసినట్టు కనిపిస్తోంది. అసలే వకీల్ సాబ్ షూట్‌లో బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ అందరికీ సెల్పీ ఇచ్చాడు.

Jani Master With Pawan Kalyan In Vakeel saab Set,
Jani Master With Pawan Kalyan In Vakeel saab Set,

చాలా గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇంత కాలం గుబురు గడ్డం, జుట్టు పెంచుకుని ఉన్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కోసం అవన్నీ తీసేశాడు. క్లీన్ షేవ్‌లో దర్శనమిచ్చాడు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి దిగిన పవన్ కళ్యాణ్ ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ స్మార్ట్ లుక్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. ఇక తాజాగా బొమ్మ అదిరింది టీంతో పవన్ కళ్యాణ్ దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి.

Jani Master With Pawan Kalyan In Vakeel saab Set,
Jani Master With Pawan Kalyan In Vakeel saab Set,

వకీల్ సాబ్ సెట్‌లో శ్రీముఖి, జానీ మాస్టర్‌, గల్లీ బాయ్స్ రియాజ్ పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఇలా అందరూ ఒకేసారి కలవడం వెనుక ఏదైనా స్పెషల్ కారణం ఉందా? లేదా? అనేది తెలియడం లేదు. వకీల్ సాబ్ మూవీ కోసం కలిశారా? లేదా? ఫ్యాన్ మూమెంట్ కోసమే కలిశారా? అన్నది తెలియాలి.