‘దేవర’లో జాన్వీ కపూర్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల

ఎన్‌ టి రామారావు, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘దేవర’ సినిమా నుంచి జాన్వీకపూర్‌ లుక్‌ ఒకటి విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె తంగంగా కనిపించనుందని చెప్పారు. ‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్‌, ఎన్టీఆర్‌ పక్కన నటిస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో శ్రీదేవి ఎలా కనపడేదో ఇప్పుడు ఆమె కుమార్తె అయిన జాన్వీ కపూర్‌ కూడా అలానే కనపడుతోందని నెటిజన్స్‌ అంటున్నారు. తల్లికి ఏమాత్రం తీసిపోకుండా కూతురు ఉందని అంటున్నారు.

ఇందులో సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్‌ 5న మొదటి పార్టు విడుదల అవుతుందని కూడా అధికారికంగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. కొరటాల శివ ‘దేవర’ కథని ఎన్టీఆర్‌ కి కరెక్టుగా సరిపోయేటట్టుగా రాసుకున్నాడు అని, ఇందులో ఎన్టీఆర్‌ విశ్వరూపం చూడొచ్చు అని కూడా యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

ఎన్టీఆర్‌ ఇందులో రెండు పాత్రల్లో కనపడ నున్నాడని తెలిసిందే. ఈ సినిమా కథ ఒక పార్టులో చెప్పే వీలుకాదని, అందుకని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్టుగా చిత్ర నిర్వాహకులు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో పోరాట సన్నివేశాలు అదిరిపోయేట్టు వచ్చాయని, దానికి విదేశీ సాంకేతిక నిపుణులను రప్పించి చేయించారు. అనిరుద్‌ రవిచందర్‌ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు. అలాగే సాబు సిరిల్‌ ఈ సినిమాకి ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్నాడు. ఈ సినిమాని నందమూరి కళ్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ విూద నిర్మిస్తున్నారు.