అల్లు అర్జున్ రేంజ్ అదీ.. బన్నీపై ప్రశంసలు కురిపించిన జాన్వీ కపూర్!

ఐకాస్టర్ అల్లు అర్జున్ కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.సాధారణ అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం అభిమానులుగా మారిపోయారు. ముఖ్యంగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఈ విధంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా యాడ్స్ చేస్తూ ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు.అయితే ఇలా పలు యాడ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి అల్లు అర్జున్ యాడ్స్ చూసి కూడా అభిమానులుగా మారిపోతున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నటువంటి అల్లు అర్జున్ తాజాగా కోకో కోలా యాడ్ ద్వారా మరో సారి అభిమానుల ముందుకు వచ్చారు.

ఇక కోకోకోలా యాడ్ ఒక పాటకు డాన్స్ చేస్తూ ఉన్న విధంగా రూపొందించారు. అయితే ఇలా అల్లు అర్జున్ డాన్స్ చేస్తూ ఉన్నటువంటి ఈ యాడ్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ఇకపోతే అల్లు అర్జున్ చేస్తున్నటువంటి ఈ యాడ్స్ పై నటి జాన్వీ కపూర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… యాడ్స్ ద్వారా ఆయన మెస్మరైజింగ్ చేసే రేంజ్ అల్లు అర్జున్ ది అంటూ ఈ సందర్భంగా ఈమె తనపై ప్రశంసల కురిపించారు. మొత్తానికి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన తర్వాత ఈయన నేషనల్ వైడ్ పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారు.