జాన్వీ కపూర్.! అప్పుడే కాదంటోంది.!

జాన్వీ కపూర్ తెలుగు తెరపై తెరంగేట్రం కోసం చాలా చాలా ఎక్కువ సమయం తీసుకుంది. ప్రస్తుతం ‘దేవర’ సినిమాలో నటిస్తోంది జాన్వీ కపూర్. ఇదే ఆమెకి తొలి తెలుగు సినిమా.!

వాస్తవానికి, రామ్ చరణ్ సరసన ఓ సినిమాలో జాన్వీ కపూర్‌తో నటింపజేద్దామనే ప్రయత్నాలు చాలా గట్టిగానే జరిగాయి గతంలో. అఖిల్, నాగచైతన్యల కోసమూ ప్రయత్నాలు చేశారు.

విజయ్ దేవరకొండ సరసన జాన్వీ నటించబోతోందనే ప్రచారమూ జరిగింది. ఎన్టీయార్‌ సినిమాతోనే తెరంగేట్రం ఖాయమైంది. మరి, తదుపరి చేయబోయే తెలుగు సినిమా సంగతేంటి.? టాలీవుడ్ నుంచి గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నా, జాన్వీ కపూర్ దేనికీ ఓకే చెప్పడంలేదట. రెమ్యునరేషన్ విషయంలో కాదుగానీ, కథల ఎంపిక విషయంలోనే జాన్వీ కపూర్ నానా రకాల సాకులూ చూపిస్తోందని అంటున్నారు.

ఇంకో ఏడాది వరకు జాన్వీ కపూర్ నుంచి రెండో తెలుగు సినిమాపై ప్రకటనని ఆశించలేం.. అన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.