ఇండియా వైడ్ భారీ రికార్డు సెట్ చేసిన “జల్సా” రీ రిలీజ్..!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఎన్నో రిమార్కబుల్ హిట్ చిత్రాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేసిన మొదటి సినిమా “జల్సా” చిత్రం కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా పవన్ రేంజ్ హిట్ కాకపోయినా సూపర్ హిట్ గా నిలిచింది అప్పట్లో..

అయితే ఈ సినిమాని ఇప్పుడు మళ్ళీ పన్నెండేళ్ల తర్వాత పవన్ బర్త్ డే కానుకగా రీమాస్టర్ చేసి రిలీజ్ చెయ్యగా దీనికి మాత్రం ఆల్ టైం రికార్డు రెస్పాన్స్ నమోదు కావడం ఆసక్తిగా మారింది. ఈ సినిమాని నిన్న సెప్టెంబర్ 1న అడ్వాన్స్ గా రిలీజ్ చేసుకోగా దీనిని భారీ వసూళ్లతో పాటుగా ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమా కూడా అందుకోని రేంజ్ నెంబర్ స్పెషల్ షోస్ తో అదరగొట్టింది.

గత చిత్రం “పోకిరి” స్పెషల్ షోస్ 500 నమోదు కాగా దీన్ని రెండు రోజులు ముందే బ్రేక్ చేసేసి ఇప్పుడు ఏకంగా 701 షోస్ తో ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. దీనితో అయితే మరి హిస్టరీ మళ్ళీ నమోదు చేయబడింది అని చెప్పాలి. అయితే ఈ రికార్డును మళ్ళీ ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి. ఇంకా ఈ సినిమాలో అయితే ఇలియానా హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చాడు.