ఎన్టీఆర్ తో తొడ కొట్టించాలని ప్లాన్ చేసిన జక్కన్న.. వామ్మో మామూలు ప్రణాళిక కాదే..?

ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. విజువల్ వండర్ గా భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి మరొక భారీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా ప్రస్తుతం విడుదల కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో టాలీవుడ్ క్యూట్ కపుల్ రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ప్రపంచ స్థాయిలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలో తెలుగు, తమిళ్,కన్నడ, మలయాళం భాషలలో రాజమౌళి సమర్పణలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. కానీ వినాయక నిమజ్జనం ఉండటం వల్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయలేమని ఈ ఈవెంట్ ని చివరి నిమిషంలో రద్దు చేశారు. దీంతో సినిమా యూనిట్ వెంటనే పార్క్ హయాత్ లో ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి మాట్లాడుతూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేయాలని నిర్ణయించుకున్నాము. కానీ చివరి నిమిషంలో అది రద్దు చేయటం వల్ల ఈ చిత్ర బృందానికి దాదాపు రెండున్నర కోట్ల రూపాయల నష్టం వచ్చిందని రాజమౌళి వెల్లడించారు.

బ్రహ్మాస్త్ర సినిమాలో రణబీర్ కపూర్ తన చేతి నుండి మంటలు వచ్చే ఒక అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాడు. అయితే దాన్ని లైవ్‌లో చూపించాలని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారీగా ప్లాన్ చేసుకున్నాం…కానీ కుదరలేదు. అలాగే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ చేత కొట్టించాలని ప్లాన్ చేసాము. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తొడగొట్టు చిన్నా అని రణ్‌భీర్ కపూర్ అనగనే ఎన్టీఆర్ తొడగొడితే ఫైర్ వచ్చేలా ప్లాన్ చేశాం. అదికూడా కుదరలేదు. కానీ దాన్ని బ్రహ్మాస్త్ర సక్సెస్‌మీట్‌లో కచ్చితంగా చేసి చూపిస్తాం అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఎన్టీఆర్ ని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వేస్ట్ గా పిలిచి అతనితో తొడ కొట్టించటానికి జక్కన్న భారీ స్థాయిలో ప్రణాళిక చేసినట్లు తెలుస్తోంది.