జైలర్ స్టోరీ లీక్.. విక్రమ్ లాంటి సెంటిమెంట్?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఈనెల 11వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ గ్రాండ్ గా నిర్మించింది. ఇక ఇప్పటివరకు విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ పరవాలేదు అనిపించే విధంగా సినిమాపై అంచనాలను అయితే పెంచాయి.

ఇక ఈ సినిమా కంటెంట్ గురించి సోషల్ మీడియాలో లీకులు మొదలయ్యాయి. సినిమా అసలు కథ ఇదే అంటూ చాలామంది చర్చించుకుంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే ఈ సినిమాల్లో కూడా విక్రమ్ మూవీ తరహాలో మనవడి సెంటిమెంట్ ఉండబోతుందట. జైలర్ గా చాలా కాలం పాటు సేవలు అందించిన రజనీకాంత్ పాత్ర రిటైర్ అయిన తర్వాత ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతూ ఉంటాడట.

అతనికి మనవడు కూడా ఉంటాడు. అయితే కొడుకు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఒక కేసు విషయంలో బిజీగా ఉండగా హఠాత్తుగా మాయమవుతాడు. ఇక జైలర్ అనుభవంతో రజినీకాంత్ పాత్ర తన కొడుకును కనుగొనడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఒక అతి పెద్ద ముఠా దాని వెనుక ఉన్నట్లు హీరో గ్రహిస్తాడు. ఇక మనవడి సెంటిమెంట్ కూడా సినిమాలో చాలా బాగా కనెక్ట్ అవుతుందట.

విక్రమ్ సినిమాలో కూడా కమల్ హాసన్ మనవడితో చాలా ఎమోషన్ ను హైలెట్ చేశాడు. అయితే ఇప్పుడు రజినీకాంత్ పాత్ర కూడా దాదాపు అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫైనల్ గా సినిమా లో హీరో తన కొడుకును కనుగొన్నాడా లేదా? ఇక అతిపెద్ద ముఠా వెనుక ఉన్న రహస్యాలు ఏంటి అనే విషయాలను ఎలా చేదించాడు అనేది సినిమాలోని ప్రధానాంశం అని తెలుస్తోంది. కంటెంట్ బాగానే ఉంది కానీ దర్శకుడు దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేసి ఉంటాడు అనేది బిగ్ స్క్రీన్ పై చూస్తే గానే క్లారిటీ రాదు. మరి ఈ కంటెంట్ ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.