“జైలర్” ఎట్ 12..తెలుగు చిత్రాలని డామినేట్ చేస్తున్న రజిని

ఈ ఏడాది టాలీవుడ్ సహా సౌత్ స్టేట్స్ లో కూడా సెన్సేషనల్ హిట్ అయ్యినటువంటి చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ హిట్ చిత్రం “జైలర్” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రం సర్ప్రైజింగ్ గా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ నంబర్స్ ని సెట్ చేయగా ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఊహించని రన్ ని కొనసాగిస్తుంది.

ఐతే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గట్టి పోటీ నడుమ రిలీజ్ అయినప్పటికీ కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడి రికార్డు వసూళ్లు నమోదు చేస్తూ రజిని కెరీర్ లోనే కాకుండా కోలీవుడ్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ గ్రాసర్ లలో ఒకటిగా నిలిచింది. అయితే ఇపుడు ఈ చిత్రం షాకింగ్ గా మన తెలుగు చిత్రాల సరసన నిలుస్తుంది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఇప్పుడు రెండు వారాల రన్ ని కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం ఈ రెండు వారాల్లో ఏకంగా 12 రోజులు పాటుగా వరుస కోటి రూపాయల షేర్ ని రాబట్టింది. ఇది ఓ యూనిక్ రికార్డు కాగా ఈ ఏడాది చిత్రాల్లో అయితే ఈ ఫీట్ అందుకున్న చిత్రాలు మూడే ఉంటే అందులో వాల్తేరు వీరయ్య నెక్స్ట్ బేబీ చిత్రం వాటితో పాటుగా జైలర్ మాత్రమే వరుసగా 12 రోజులు కంటిన్యూస్ గా కోటి షేర్ ని అందుకున్న సినిమాగా నిలిచినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

దీనితో రజిని డామినేషన్ మాములుగా లేదని చెప్పక తప్పదు. ఇంకా ఈ చిత్రంలో తమన్నా మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా అనిరుద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.