కనగరాజ్‌ బాటలో ‘జైలర్‌’ దర్శకుడు!

తమిళ చిత్రసీమలో ప్రస్తుతం ఉన్న స్టార్‌ దర్శకులలో నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఒకడు. ఒక ప్రైవేట్‌ టెలివిజన్‌లో అసిస్టెంట్‌గా కెరీర్‌ ప్రారంభించిన నెల్సన్‌ 2010లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. నటుడు శింబుతో వెడై మన్నన్‌ అనే సినిమాను తీయగా.. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టార్‌ అందుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత నయనతారను ప్రధాన పాత్రలో పెట్టి కొలమావు కోకిల అనే డార్క్‌ కామెడీ సినిమా తీసి విజయం అందుకున్నాడు. అనంతరం శివ కార్తీకేయన్‌తో డాక్టర్‌ వరుణ్‌ సినిమా తీసి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఇక రీసెంట్‌గా రజనీకాంత్‌ హీరోగా వచ్చిన ’జైలర్‌’ సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నాడు నెల్సన్‌.

ఇదిలా ఉంటే.. లియో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించడానికి నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ’జి స్క్వాడ్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి ఫైట్‌ క్లబ్‌ అనే మూవీ కూడా తీశాడు.

అయితే ఇప్పుడు లోకేష్‌ కనగరాజ్‌ బాటలో నెల్సన్‌ అడుగులు వేయబోతున్నాడు. నెల్సన్‌ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్‌ డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడానికి నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తమిళంలో ప్రస్తుతం స్టార్‌ దర్శకుడిగా కొనసాగుతున్న నెల్సన్‌ నిర్మాణ రంగంలోనూ తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. కాగా దీనిపై నెల్సన్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.