ఈ దేశంలో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ తమిళ సినిమాగా “జైలర్”

ఈ ఏడాది తమిళ నాట్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా కాదు ఈ ఏడాదికే బిగ్ హిట్ గా నిలిచిన చిత్రమే “జైలర్”. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మిల్కి బ్యూటీ తమన్నా గెస్ట్ రోల్ లో తనతో పాటుగా శివ రాజ్ కుమార్ మరియు మోహన్ లాల్ వంటి ఎందరో బిగ్ స్టార్స్ తో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చేసిన చిత్రమే ఇది.

ఇక ఈ సినిమా అయితే అప్పటివరకు పెద్దగా అంచనాలు లేనప్పటికీ ట్రైలర్ తర్వాత ఒక్కసారిగా మంచి బజ్ తెచ్చుకుంది. దీనితో ఈ సినిమా రిలీజ్ అయ్యాక సెన్సేషనల్ హిట్ గా ఇది నిలిచింది. ఇక ఇండియా లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో జైలర్ కి భారీ వసూళ్లు నమోదు కాగా..

ఇప్పుడు జైలర్ తమిళ సినిమా నుంచి ఓ అరుదైన ఘనత అందుకుంది అని తెలుస్తుంది. కాగా మేటర్ ఏమిటంటే ఈ సినిమా ఇప్పుడు మన పక్క దేశం బంగ్లాదేశ్ లో విడుదల కాబోతుంది అట. ఇదేం పెద్ద విషయం అంటే పెద్ద విషయమే అని చెప్పాలి. అక్కడ కానీ పాకిస్తాన్ లో కానీ అసలు ఇండియన్ సినిమాలు విడుదల కావడమే చాలా అరుదు.

ఒకటి విడుదలైన ఎన్నో ఏళ్ల తర్వాత రిలీజ్ అవ్వడం కష్టం అలాంటిది ఇపుడు జైలర్ మొట్ట మొదటి తమిళ సినిమాగా బంగ్లాదేశ్ లో ఈ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనితో తమిళ వర్గాల్లో ఈ వార్త వైరల్ గా మారింది.