ఇండస్ట్రీ టాక్ : “జైలర్” వసూళ్లు కావాలనే తక్కువ వేస్తున్నారా?

గడిచిన ఈ రెండేళ్లలో అయితే ఒక్క టాలీవుడ్ సినిమా అలానే కన్నడ సినిమా మినహా మిగతా సినీ ఇండస్ట్రీలలో సరైన హిట్ చిత్రాలు లేక ఇబ్బందులు పడ్డాయి. మరి వాటిలో అయితే కోలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఉంది. అయితే లాస్ట్ ఇయర్ లో మాత్రం ఎట్టకేలకి ఒకే ఏడాదిలో రెండు భారీ ఇండస్ట్రీ హిట్ చిత్రాలు కోలీవుడ్ నుంచి వచ్చాయి.

దీనితో కోలీవుడ్ కూడా నెమ్మదిగా కోలుకోవడం స్టార్ట్ చేసింది. కానీ మళ్ళీ ఈ ఏడాదికి వచ్చేసరికి మాత్రం రియల్ టైం లో సెన్సేషనల్ హిట్ మాత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ “జైలర్” వచ్చే వరకు రాలేదు. మరి రజినీకాంత్ నటించిన ఈ భారీ చిత్రం తమిళ నాట రికార్డు వసూళ్లు తిరగరాస్తుంది.

పాన్ ఇండియా వైడ్ గా హిట్ కాకపోయినప్పటికీ 500 కోట్ల మార్క్ ని ఈ చిత్రం సింపుల్ గా క్రాస్ చేసేసింది. దీనితో తమిళ సినిమా పొటెన్షియల్ వరల్డ్ వైడ్ గా ఏ లెవెల్లో ఉంటుందో ఈ చిత్రం చూపించింది. అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యిన తర్వాత మేకర్స్ అధికారికంగా వేస్తున్న నంబర్స్ కి అలాగే తమిళ సినీ ట్రాకర్స్ చేస్తున్న వసూళ్లు చాలా డిఫరెన్స్ ఉన్నాయి.

జైలర్ 525 కోట్లు రెండు వారాల్లో అందుకున్నట్టుగా నిర్మాణ సంస్థ చెప్పారు. కానీ రియల్ టైం లో ఇది 580 కోట్ల పై మాటే తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. అయితే మరి చిత్ర యూనిట్ ఈ వసూళ్లు కావాలనే తక్కువ చెప్తున్నారు అని దీనికి కారణం ఇన్ కం ట్యాక్స్ కారణాలే కావచ్చని కొందరు అంటున్నారు. దీనితో తక్కువ వసూళ్లు లెక్క చూపిస్తే ట్యాక్స్ లు తక్కువ కట్టుకోవచ్చని అందుకే ఇలా చేస్తున్నారు అనే రూమర్స్ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలి.