తెలుగులో హయ్యస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ ఇప్పుడు ఎవరు.? అంటే, నిస్సందేహంగా జాన్వీ కపూర్ పేరే చెప్పాలి. ‘దేవర’ కోసం రికార్డు స్థాయిలో ఆమెకు రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తెలుగులో ఏ హీరోయిన్ కూడా అందుకోని రెమ్యునరేషన్ ఫిగర్ అది.
తాజాగా, ఆ రికార్డుని తానే తిరగరాసుకుందిట జాన్వీ కపూర్, అదీ రామ్ చరణ్ సినిమా కోసం. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఎంపికైన సంగతి తెలిసిందే కదా.! ఈ సినిమా కోసం కనీ వినీ ఎరుగని రీతిలో జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ అందుకుంటోంది.
ముచ్చటగా మూడో తెలుగు సినిమాకి కూడా జాన్వీ కపూర్ ఓకే చెప్పిందనీ, అధికారిక ప్రకటన రావాల్సి వుందనీ అంటున్నారు. ఈసారి హీరోని రిపీట్ చేస్తోందిట జాన్వీ కపూర్. ఎవర్ని, జూనియర్ ఎన్టీయార్‌నా.? రామ్ చరణ్‌నా.? ఏమో, అదైతే ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్, ప్రస్తుతానికి బాలీవుడ్‌కి కాస్త దూరంగా వున్నట్లేనా.? అంటే, అంతేనని అనుకోవాలి. ఓ సెన్సేషనల్ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్ నటించాల్సి వున్నా, ఆమె సింపుల్‌గా ‘నో’ చెప్పేసిందట.
ఒప్పుకున్న తెలుగు సినిమాలతోపాటు, బాలీవుడ్ సినిమాలకు డేట్స్ కేటాయించడం కష్టమవుతుందన్న కోణంలో, కొన్నాళ్ళపాటు కొత్తగా ఏ బాలీవుడ్ ప్రాజెక్టుకీ సైన్ చేయకూడదని జాన్వీ కపూర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
మూడో ప్రాజెక్ట్ దాదాపు ఓకే అయిపోతున్న దరిమిలా, తెలుగులో నాలుగో ప్రాజెక్ట్‌కీ జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాల్లేకపోలేదని అంటున్నారు. అంతే మరి, అవకాశాలు వచ్చినప్పుడే కదా.. కాసులు వెనకేసుకోవాలి.!