టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు పొందిన జగపతిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మావిడాకులు, శుభలగ్నం, సర్దుకుపోదాం రండి, ఫ్యామిలీ సర్కస్’ సినిమాల ద్వారా ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు మంచి గుర్తింపు పొందారు. ఇలా ఫస్ట్ ఇన్నింగ్స్ లో హీరోగా కొనసాగిన జగపతిబాబు కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యాడు. తర్వాత ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి ప్రతినాయకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తెలుగు , తమిళ్, కన్నడ భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉండగా గతంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సౌందర్య తో కలిసి జగపతిబాబు ఎన్నో సినిమాలలో నటించాడు. అప్పట్లో వీరిద్దరు నటించిన సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ మీద కూడా వీరిద్దరి జంట చక్కగా ఉండేది. అంతే కాకుండ వీరిద్దరూ కూడా చనువుగా ఉంటూ ఒకరి ఇంటికి ఒకరు తరచు వెళ్ళేవారు. దీంతో వీరిద్దరి మధ్య చాలా బలమైన బంధం ఉందని పుకార్లు వినిపించేవి. కానీ సౌందర్య పెళ్ళి తర్వాత ఈ పుకార్లకు చెక్ పడింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతి బాబు ఈ విషయం పై స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో జగపతిబాబు మాట్లాడుతూ.. సౌందర్యకు నాకు మధ్య ఉన్న రిలేషన్ వాస్తవమేనని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాకపోతే అందరూ అనుకుంటున్న బంధం మా ఇద్దరి మధ్య లేదని, మేముద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ వెల్లడించాడు. మేము మాత్రమే కాకుండా మా కుటుంబాలు కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవి అందువల్ల ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా ఒకరింటికి మరొకరు వెళ్ళేవారు. అలాగే సౌందర్య కూడా తరచు మా ఇంటికి వచ్చేది అంటూ క్లారిటీ ఇచ్చాడు. సౌందర్య చాలా మంచి అమ్మాయి అని, ఆమె మరణంతో ఇండస్ట్రీ లో తీవ్ర లోటు ఏర్పడిందని జగపతి బాబు చెప్పుకొచ్చాడు.