మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి అందరికీ సుపరిచితమే. ఈమె తరచూ తన వ్యక్తిగత కారణాల వల్ల సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తుంటారు.ఇప్పటికే తన ప్రేమ పెళ్లిళ్లు విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన శ్రీజ తాజాగా మరొక పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.తాజాగా శ్రీజ చేసిన పోస్ట్ చూసినటువంటి నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్ట్ చూస్తుంటే శ్రీజ మరో పెళ్లికి సిద్ధమైందని తెలుస్తోంది.
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శ్రీజ స్పందిస్తూ గత ఏడాది జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా డియర్ 2022… నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిసేలా చేశావు. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి నన్ను ప్రేమిస్తూ చాలా కేరింగ్ గా చూసుకున్నటువంటి వ్యక్తి. నా కష్ట సమయాలలో తోడుండే వ్యక్తి ఎప్పుడు నాకు సపోర్ట్ గా ఉండే వ్యక్తిని కలుసుకోవడం అదృష్టం. కొత్త ప్రయాణం మొదలవుతుంది అంటూ శ్రీజ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
అయితే ఇప్పటికే ఈమె కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకున్నప్పటికీ ఈ విషయాన్ని ప్రకటించలేదని అయితే తనకు మూడో పెళ్లి కూడా జరగబోతుంది అటు గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో శ్రీజ చేసిన ఈ పోస్ట్ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైందా అందుకే ఇలాంటి పోస్ట్ చేసిందా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.మరి శ్రీజ ఎలాంటి ఉద్దేశంతో ఈ పోస్ట్ చేసిందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది.