పవన్ కళ్యాణ్ చేశాడు.! చేయించాడు కూడా.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి అంత సమయమెక్కడిది.? ఇచ్చిన డేట్స్ చాలా చాలా తక్కువ. ఓ పాతిక రోజులు మాత్రమే కేటాయించాడట ‘బ్రో’ సినిమా కోసం.! కానీ, ‘బ్రో’ సినిమాలో అంతా తానే అయి కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ట్రైలర్ చూశాక, ఆ పవర్‌ని అంతా ఫీల్ అవ్వాల్సిందే.

స్పెషల్ థింగ్ ఏంటంటే, సాయి ధరమ్ తేజ్.! అది కూడా, పవన్ కళ్యాణ్ డైరెక్షన్‌లో.! అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, సాయి ధరమ్ తేజ్ మీద పవన్ కళ్యాణ్ ప్రభావం చాలా చాలా కనిపించడానికి కారణం, పవన్ సూచనలతో సాయిధరమ్ తేజ్ నటించడమే.

కొన్ని సీన్స్, పవన్ కళ్యాణ్ కనుసన్నల్లో డిజైన్ చేయబడ్డాయట. పవన్ ఆలోచనలకు తగ్గట్టుగా దర్శకుడు సముద్రఖని, సాయి ధరమ్ తేజ్ మీద సన్నివేశాల్ని చిత్రీకరించాడట. మేనమామే గురూ.. అయితే ఇదిగో ఇలా వుంటుంది.

రోజుకి రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఈ సినిమాకి తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఓ వైపు నటుడిగా, ఇంకో వైపు సాయి ధరమ్ తేజ్‌కి మెంటార్‌గా పని చేశాడన్నమాట.