ఇప్పుడు అందరి దృష్టి మోహన్ బాబు ఇంటి గొడవల మీదే ఉంది. ఆ ఇంటి నుంచి ఎప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందా అని మీడియా తెగ ఉత్సాహం చూపిస్తుంది. అందుకు తగినట్టుగానే ఆ ఇంటి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మీడియాతో మాట్లాడుతూ లేటెస్ట్ న్యూస్ లు అందిస్తున్నారు. తాజాగా మంగళవారం రాత్రి మోహన్ బాబు ఇంటి ముందు జరిగిన గొడవ గురించి మంచు విష్ణు మాట్లాడుతూ ఇలాంటి సమస్యలు ప్రతి ఇంట్లో ని ఉంటాయి.
కాబట్టి ఈ విషయాన్ని పెద్దదిగా చేసి చూపించద్దని మీడియాని రిక్వెస్ట్ చేశాడు. అలాగే నిన్న జరిగిన దాడిలో నాన్నకి గాయాలయ్యాయి, కుటుంబ గొడవల కారణంగా అమ్మ హాస్పిటల్ పాలయింది. మనోజ్ చేసిన గొడవకి ఒక తండ్రిగా నాన్న తక్కువగానే రియాక్ట్ అయ్యారు. మమ్మల్ని అతిగా ప్రేమించడమే ఆయన చేసిన తప్పు. మేమందరం కలిసి మెలిసి ఉంటాం అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు ఇలా జరిగింది కానీ మేము మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నాము.
ప్రేమతో గెలవాల్సిన విషయాలని రచ్చ చేసుకుంటే ఏమి జరగదు, మనోజ్ ఆరోపణలపై నేను చెప్పేది ఏమీ లేదు. నాన్న గారి ఆస్తి ఆయన ఇష్టం. ఎంతో కష్టపడి స్వయంకృషి తో గొప్ప స్థాయికి ఎదిగారు, నాన్న ఏది అనుకుంటే అదే జరగాలి తల్లిదండ్రులని గౌరవించడం పిల్లలుగా మా బాధ్యత. అలాగే నిన్న జరిగిన గొడవలో ఒక రిపోర్టర్ కి గాయాలయ్యాయి అది దురదృష్టకరం. మీడియా వారిని ఆయన నమస్కరిస్తూ వచ్చారు. కానీ అలా జరిగిపోయింది.
గాయపడిన రిపోర్టర్ తో టచ్ లో ఉన్నాము, ఉద్దేశపూర్వకంగా మేము ఎవరి మీద దాడి చేయలేదు. మా ఇంటి గొడవలు అందరికీ బిగ్ బాస్ షో లా ఉన్నాయి. మా కుటుంబంలో బయట వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉంది వారికి ఈ సాయంత్రం వరకు సమయం ఇస్తున్నాను లేదంటే అందరి పేర్లు నేనే బయట పెడతాను అని చెప్పిన విష్ణు గొడవలు జరిగిన సమయంలో నేను అక్కడ లేకపోవటం వలన గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయని చెప్పాడు.