పాతాళ భైరవి హీరోయిన్ ఎంత దీనస్థితిలో చనిపోయిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం. అవకాశాలు ఉన్నంతవరకు అందరూ మంచిగా జీవిస్తారు. కానీ ఎప్పుడైతే అవకాశాలు తగ్గుతాయో అప్పుడు అసలు సమస్యలు ఎదురవుతాయి. కొంతకాలం బిజీగా గడిపి మంచి మంచి విజయాలను సాధించిన కూడా కొందరికి అవకాశాలు అనేవి రావు. అలాంటి కోవకే చెందినవారు మాలతి.

మాలతి ‘భక్త పోతన’అనే సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. తరువాత పలు పాత్రలు చేస్తూ ఇంకా పలు సినిమాలకు గాయనిగా పాటలు కూడా పాడారు. తరువాత 1952లో వచ్చిన ‘పాతాళ భైరవి’సినిమాలో శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు సరసన హీరోయిన్ గా నటించారు. అప్పట్లో పాతాళ భైరవి సినిమా చాలా మంచి విషయం సాధించింది.

కానీ మాలతికి మాత్రం హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. సరే కొంతకాలం చూద్దాం అని అనుకుంటే ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. ఇక చేసేదేమీ లేక సినిమాలలో ఏ పాత్ర వస్తే ఆ పాత్రలో నటించాలి అనుకున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటించిన మాలతికి ఎన్టీఆర్ కు వదిన, చెల్లెలు లాంటి అవకాశాలు వచ్చాయి.

సరే పరిస్థితులు ఇలాగే ఉంటాయని ఏ పాత్ర వస్తే ఆ పాత్ర నటించడం ప్రారంభించారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమెకు తల్లి పాత్రలు కూడా వచ్చాయి. ఇక గద్దంతరం లేక కొన్ని సినిమాలలో తల్లిగా కూడా చేసింది. కొంతకాలం తర్వాత సినీ పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాదుకు వచ్చింది.

మాలతి హైదరాబాద్ వచ్చి సినీ అవకాశాల కోసం ఎన్నో ఆఫీసు చుట్టూ తిరిగింది. కానీ ఫలితం శూన్యం. ఆమె భర్త కూడా చనిపోయారు, ఆమెకు పిల్లలు లేరు. అవకాశాలు లేక ఇంటి రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఆమె ఒక మురికివాడలో చిన్న ఇంటిలో నివాసం కోసం ఇంటిని రెంటుకు తీసుకుంది. ఈ సమయంలో మన రాష్ట్రానికి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఆమె ఎన్టీఆర్ కు ఏమైనా సహాయం చేయమని అడిగి ఉంటే బాగుండేది, కానీ మొహమాటం ఏమైనా అడ్డు వచ్చి అడగక పోయిండొచ్చు. 1979 నవంబర్ 22న గాలివాన బీభస్తానికి ఇంటి గోడ కూలి ఆమె మరణించారు. అయితే మాలతి ప్రతిరోజు గుడికి వెళ్లేవారు. రెండు రోజులుగా గుడికి రావడం లేదని గమనించిన పూజారి ఏమై ఉంటుందని ఆరా తీయగా గోడ కూలి శిధిలాల కింద ఆమె మృతదేహం ఉంది. ఇంకా ఆమె పక్కన ఒక పెట్టె ఉంది. పెట్టెను తెరచి చూడగా అందులో పాతాళబైరవి సినిమా ఫోటోలు, ఆమె చేసిన సినిమాల వివరాలు అందులో ఉన్నాయి.