బుచ్చిబాబుతో ‘రంగస్థలం’ను మించిన సినిమా!

ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన రామ్ చరణ్… ఎట్టకేలకు తన భార్య ఉపాసనతో కలిసి ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఇండియా టుడే సంస్థ నిర్వహించిన ప్రోగ్రాం ఢిల్లీలో జరుగుతూ ఉండడంతో కార్యక్రమాన్ని ముగించుకుని నిన్న రాత్రి తన తండ్రి చిరంజీవితో కలిసి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అక్కడి ఫోటోలు బయటకు రావడంతో అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి స్పెషల్ ఫ్లైట్లో రామ్ చరణ్ తేజ్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. వాస్తవానికి ప్రధానమంత్రి మోడీతో కలిసి రామ్ చరణ్ స్టేజ్ పంచుకోబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అది నిజం కాలేదు. అయితే ఇండియా టుడే కాన్క్లేవ్లో మాత్రం బుచ్చిబాబు సానాతో తాను చేయబోతున్న సినిమా గురించి రాంచరణ్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇంకా ఈ సినిమా ప్రారంభోత్సవం జరగలేదు. కానీ ఈ సినిమా ఒక రేంజ్లో ఉంటుందంటూ ఎలివేషన్ ఇచ్చాడు రామ్ చరణ్. బుచ్చిబాబుతో చేయబోయే సబ్జెక్ట్ చాలా డిఫరెంట్ అని తన బెస్ట్ మూవీస్లో ఒకటిగా నిలిచిన రంగస్థలంను మించి ఇందులో పర్ఫామెన్స్కు స్కోప్ దక్కబోతుందని చెప్పుకువచ్చారు. ఈ కథ కేవలం భారతీయులకే కాదు వెస్ట్ నాడియన్స్ని కూడా మెప్పించేలా చాలా స్పెషల్గా ఉంటుందని రామ్ చరణ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

నిజానికి రాంచరణ్ తన 15వ సినిమా ఆయన శంకర్ సినిమా గురించి ఏమైనా చెబుతాడని అనుకున్నారు. కానీ ఇలా బుచ్చిబాబు గురించి ఆయన సినిమా గురించి ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే రంగస్థలంను మించి పర్ఫామెన్స్కి స్కోప్ దక్కబోతోందని కామెంట్ చేయడంతో ఈసారి కూడా గట్టిగానే ఏదో ప్లాన్ చేసినట్టు ఉన్నారని వారంతా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాక సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉందనడంతో శంకర్ సినిమా అప్పటికి క్లోజ్ అవ్వబోతుందని క్లారిటీ వచ్చిందని అంటున్నారు.