శ్రీలీల ఆ ఒక్క విషయంలో కృతి శెట్టిని బీట్ చేసిందా?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ కృతి శెట్టి. ఈ అమ్మడు మొదటి సినిమా పెళ్లి సందడి ఫ్లాప్ అయిన రెండో సినిమా ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ రిలీజ్ కాకుండానే ఇండస్ట్రీలో శ్రీలీల చేతికి ఏకంగా అరడజను సినిమాలు వచ్చి చేరాయి. ఇక ధమాకా మూవీ తర్వాత పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు కూడా ఆమె ఖాతాలోకి రావడం సంచలనంగా మారింది. మరో వైపు బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అనిల్ రావిపూడి చిత్రంలో కీలక పాత్రలో నటించడానికి ఒకే చెప్పింది.

ఇలా ఆమె చేతిలో ప్రస్తుతం పది సినిమాల వరకు ఉన్నాయి. వేటికవే ప్రత్యేకమైన మూవీస్ కావడం విశేషం. ఇక ఆమె చేస్తున్న వాటిలో మూడు పాన్ ఇండియా మూవీస్ కూడా ఉండటం విశేషం. అవి సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్, బోయపాటి కాంబో మూవీ, నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకేక్కుతున్నాయి. ఇదే సమయంలో శ్రీలీల తరహాలోనే కృతి శెట్టి ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ఇప్పటి వరకు ఆరు సినిమాలు చేసింది. అందులో మూడు హిట్, మూడు డిజాస్టర్ మూవీస్. ప్రస్తుతం ఆమె చేతిలో కస్టడీ మూవీ మాత్రమే ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఆమె కెరియర్ మరల గాడిలో పడే అవకాశం కనిపిస్తుంది. కృతి శెట్టి కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ ఆశించారు. ఇదిలా ఉంటే శ్రీలీల మొదటి సినిమా ఫ్లాప్ అయిన వరుస అవకాశాలు తెచ్చుకోవడానికి, కృతి శెట్టి బ్లాక్ బస్టర్ కొట్టిన కూడా కెరియర్ పరంగా వెనకబడిపోవడానికి రీజన్ ఏంటి అనే దానిపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.

అయితే శ్రీలీల కథల ఎంపికలో పెర్ఫెక్ట్ గా వెళ్తుంది. కాంబినేషన్స్ కి ప్రాధాన్యత ఇస్తూనే, మంచి యాక్టివ్ రోల్స్ ని ఎంపిక చేసుకుంటుంది. ఈ కారణంగా ఆమెకి మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే కృతి శెట్టి కాంబినేషన్స్ మీద ఫోకస్ పెట్టి కథలని కనీసం వినకపోవడం వలన వరుసగా మూడు డిజాస్టర్ సినిమాలతో ఆమె కెరియర్ వెనక్కి వెళ్ళిపోయింది అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.