వకీల్ సాబ్ లో ఆ ఒక్కటి లేనట్టేనబ్బా ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ‘వకీల్ సాబ్’ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ నవంబర్ 1 నుంచి మళ్ళీ షూటింగ్ మొదలైంది. పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుండి షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. కొన్ని సీన్స్ ని మెట్రో స్టేషన్లో షూట్ చేశారు. ఒకవైపు షూటిన్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ మరో వైపు ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలని కంప్లీట్ చేస్తున్నారు. కాగా ఈ నెల 15 వరకు పవన్ కళ్యాణ్ మీదే సీన్స్ కంప్లీట్ చేయనున్నారట.

Pawan Kalyan looks sharp as lawyer in 'Vakeel Saab' motion poster, fans say  'Boss is back'

ఎం.సి.ఏ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పిస్తున్నాడు. నివేదా థామస్, అంజలి, అనన్య పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సినిమాలో పవన్ కి జంటగా శృతి హాసన్ నటించనుందని తెలిసిందే. అయితే వకీల్ సాబ్ షూటింగ్ ప్రారంభం అయిందనగానే శృతి హాసన్ కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అయిందని .. పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ మీద కాంబినేషన్ సీన్స్ తో పాటు ఇద్దరి మీద ఒక సాంగ్ కూడా షూట్ చేయనున్నారన్న వార్తలు వచ్చాయి.

కాగా విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం శృతి హాసన్ ఇప్పుడు షూటింగ్ లో లేదని తెలుస్తుంది. డిసెంబర్ మొదటి వారం నుండి కొత్త షెడ్యూల్ మొదలుకానుండగా.. ఆ షెడ్యూల్ లో జాయిన్ కానుందని సమాచారం. అంతేకాదు శృతి హాసన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్ ఎండిటింగ్ వరకు వకీల్ సాబ్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టేస్తారని తెలుస్తుంది. 2021 సంక్రాంతికి రిలీజ్ చేయనున్న ఈ సినిమాకి థమన్ సంగీతమందిస్తుండగా దీపావళి కి టీజర్ ని రీలిజ్ చేయనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ మీద సాంగ్ లేదన్న టాక్ వినిపిస్తోంది.