Dhanush : ధనుష్ తో సినిమా తీయబోతున్న టాలీవుడ్ బడా నిర్మాత..!

Dhanush : ప్రస్తుతం టాలీవుడ్ బడా నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. ఆయన నిర్మించిన సినిమాలన్నీ దాదాపు మినిమం గ్యారెంటిగా అయిన ఉంటాయి అనే టాక్ ఉంది. తెలుగులో దిల్ రాజు వరుసగా సినిమాలు నిర్మిస్తున్నప్పటికి, ఈ మధ్య తమిళ్ హీరోల సినిమాలపై ఈయన దృష్టి పడింది. తమిళ్ హీరో విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్న డైరెక్ట్ తెలుగు మూవీ కి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నట్లు తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంకొక తమిళ్ హీరో సినిమా కూడా దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం.

తమిళ్ హీరో ధనుష్ తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న చెప్పుకోవాలి. రఘువరన్ బీటెక్ ఇక్కడ మంచి పేరు తెచ్చుకుంది.తమిళ్ సినిమా లో పాపులారిటీ తెచ్చుకున్న ధనుష్ తెలుగులో వరుసగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసిందే. అయితే ధనుష్ తెలుగు తమిళ్ రెండు భాషల్లోనూ విడుదల అయ్యేలా మరికొన్ని సినిమాలు ప్లాన్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

అయితే తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు ధనుష్ ఒక సినిమా నిర్మించాలని సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ధనుష్ కు ఆ స్క్రిప్ట్ నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ధనుష్ హైదరాబాదులో తన సార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత శేఖర్ కమ్ముల తో చేస్తున్నా తదుపరి చిత్రం లో పాల్గొంటారు. అయితే దిల్ రాజు మాత్రం తన తో సినిమా చేయడానికి చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు, ఇద్దరు ముగ్గురు దర్శకులతో కూడా గురించి చర్చిస్తున్నట్టు సమాచారం.