ఓజీ మూవీ ఒరిజినల్ టైటిల్ ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ తో ఓజీ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవర్ స్టార్ కి జోడీగా ప్రియాంకా ఆరుళ్ మోహన్ నటిస్తోంది. విలన్ గా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మీ కనిపించబోతున్నారు. తమిళ్ యాక్టర్ అర్జున్ దాస్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఉండటం వలన ఇతర కాంబినేషన్స్ లో సీక్వెన్స్ ని కంప్లీట్ చేసే పనిలో సుజిత్ ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. అలాగే జులై సెకండ్ వీక్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అందులో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

వారాహి యాత్ర కొనసాగిస్తూనే ఓజీ మూవీకి సంబందించిన షూటింగ్ ని కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. ఇకపై ఎన్నికలలో బిజీ కావడం వలన ఏపీలోనే పూర్తిగా ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ షెడ్యూల్ ఏపీలోనే సెట్స్ వేసి కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారంట. అది ఎంత వరకు వాస్తవమో తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఓజీ టైటిల్ ఫుల్ ఫామ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అని అందరూ భావించారు. కాని సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ఒజాస్ గంభీర అంట. ఈ పేరు ఎలివేట్ అయ్యే విధంగా టైటిల్ ని ఓజీ అని పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. మూవీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నారంట.

అలాగే సినిమాలో వింటేజ్ పవన్ కళ్యాణ్ ని సుజిత్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రెజెంట్ స్టైల్ లో కాకుండా కెరియర్ ఆరంభంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి లుక్స్ లో ఉండేవాడో అదే ఆహార్యం ఓజీలో చూపించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.