ఏడాదిలోపే అన్నీ.! పవన్ కళ్యాణ్‌కి సాధ్యమేనా.?

పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయ్. నాలుగూ సెట్స్ మీదున్నవే. నాలింగింటినీ ఈ ఏడాదిలోపే పూర్తి చేసేయాలి పవన్ కళ్యాణ్. అంతేకాదు, ఏడాదిలోపే రిలీజ్ చేసేయాలి కూడా. ఆల్రెడీ ‘వినోదయసితం’ పూర్తయిపోయింది. రేపో మాపో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ జరుగుతుంది.

క్రిష్ దర్శకత్వంలోని ‘హరి హరవీరమల్లు’ స్టేటస్ కూడా ఇంచుమించు అంతే. దాదాపు ఫైనల్ స్టేజ్‌కొచ్చేసింది ఈ సినిమా కూడా. ఇక మిగిలిన రెండూ రీసెంట్‌గానే సెట్స్ మీదికెళ్లినా అవి కూడా ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసేయాల్సి వుంది.

ఇక రిలీజ్ విషయానికి వస్తే, ఈ ఏడాదిలోనే ‘వినోదయ సితం’, ‘హరి హరవీరమల్లు’ సినిమాల రిలీజ్‌లుండబోతున్నాయ్. ఇక, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి లోపే రిలీజ్ చేసేయాలి.

వీటిలో ఒక సినిమాని ఎలక్షన్స్‌కి కొద్దిముందే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. బహుశా అది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కావచ్చు అని గుసగుస. చూడాలి మరి.