Samantha – Naga Chaitanya:టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ గా ఉన్నటువంటి సమంత నాగచైతన్య విడాకులు ప్రకటన చేసి సుమారు ఆరు నెలలు దాటిపోయింది.ఈ క్రమంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇలా విడాకులు తీసుకొని విడిపోవడానికి గల కారణం ఏమిటి అని పెద్దఎత్తున చర్చలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే సమంత వల్ల చైతన్య విడాకులిచ్చాడని, నాగచైతన్య కారణంగానే సమంత విడాకులు ఇచ్చింది అంటూ వీరి విడాకుల గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీరు విడాకులకు గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ వీరి విడాకులకు సరైన కారణం మాత్రం తెలియడం లేదు.
ఇదిలా ఉండగా విడాకుల తర్వాత సమంత నాగచైతన్య పూర్తిగా వారి సినీ కెరీర్ పై దృష్టి పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన నటి రాశిఖన్నా నటిస్తున్నారు. ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమలో ఉన్నటువంటి సిద్ధార్థ్ మల్హోత్రా,కియారా అద్వాని బ్రేకప్ చెప్పుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి సిద్ధార్థ్ మల్హోత్రా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.
సిద్ధార్థ్ మల్హోత్రా స్పందిస్తూ…ఏ డై విత్ ఔట్ సన్ షైన్ లైక్.. యూ నో.. నైట్” అని సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ పై నటి రాశి ఖన్నా స్పందిస్తూ ఫైర్ ఎమోజీని కామెంట్ గా పెట్టారు. రాశీఖన్నా అలా చేయడంతో వీరిద్దరు లవ్ బ్రేకప్ చెప్పుకోవడానికి కారణం నువ్వే నా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే మరికొంతమంది ఒక అడుగు ముందుకు వేసి సమంత నాగచైతన్య విడిపోవడానికి కూడా ఈ హీరోయిన్ కారణం అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.