నయనతార కి ఇక టాలీవుడ్ లో నో ఛాన్స్ ..?

సూపర్ స్టార్ రజనికాంత్ నటించిన చంద్రముఖి సినిమాతో పాపులర్ అయిన నయనతార ఆ తర్వాత తెలుగు తమిళ సినిమాలతో వరసగా అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకు అందరి సరసన నటించిన నయనతార ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా కథా బలమున్న భారీ ప్రాజెక్ట్స్.. చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ లాంటి సీనియర్ స్టార్ హీరోలకి నయనతార బెస్ట్ ఛాయిస్ గా కనిపించింది.

Will Nayanthara break her own rule for Sye Raa Narasimha Reddy? - Movies  News

ఈ ఏడాది ప్రారంభంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ లో హీరోయిన్ గా నటించింది. అలాగే గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా లో హీరోయిన్ గా నటించింది. అంతేకాదు భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి నయనతార కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. కొన్ని కథ లను మేకర్స్ ప్రత్యేకంగా నయనతార కోసమే రాయించారు. అంతగా తెలుగు, తమిళ సినిమాలలో నయనతార విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. అందుకు తగ్గట్టుగానే నిర్మాతలు నయనతార కి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారు.

అయితే ఇప్పుడు నయనతార చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనర్హం. సీనియర్ స్టార్ హీరోలే వరసగా ప్రాజెక్ట్స్ ఒకే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 6 సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ 3 ప్రాజెక్ట్స్ ఒకే చేశాడు. బాలయ్య సినిమా బిబి3 ఇప్పటికే సెట్స్ మీద ఉంది. మరో రెండి సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వెంకీ నారప్ప ఇప్పటికే మొదలైంది. ఆయన కూడా వచ్చే ఏడాది ఎఫ్ 3, మరో సినిమా కమిటయ్యాడు. కాని ఈ ప్రాజెక్ట్స్ లో ఎక్కడా నయన తార పేరు వినిపించడం లేదు. ఈ రకంగా చూస్తే ఇక టాలీవుడ్ లో నయనతార కెరీర్ క్లోజ్ అయినట్టేనా అన్న సందేహాలు కలుగుతున్నాయట.